Share News

గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:20 PM

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. మంగళవారం చింతపల్లిలో పర్యటించిన ఆయన ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు.

గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మాట్లాడుతున్న పంచకర్ల రమేశ్‌బాబు

మన్యంలో జనసేన జెండా రెపరెపలాడాలి

జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు

చింతపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. మంగళవారం చింతపల్లిలో పర్యటించిన ఆయన ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో జనసేన జెండా రెపరెపలాడాలన్నారు. ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రత్యేక జీవో తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. జనసేన కార్యకర్తలు ప్రజల మధ్య నిత్యం ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇప్పించే బాధ్యత తనదని, గెలిచే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను కార్యకర్తలు విధిగా పాటించాలని సూచించారు. గ్రూపులు కట్టడం, నాయకులను విమర్శించడం చేయరాదన్నారు. కార్యకర్తలు, నాయకులు హద్దుమీరితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం పార్టీ కార్యకర్తలకు తెలియజేయకపోతే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. తాజాగా వైసీపీని వీడిన సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ పెదపూడి మధుతో పాటు కొయ్యూరు, జీకేవీధి మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి వంపూరి గంగులయ్య, అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్టంగి పద్మ, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ఉగ్రంగి లక్ష్మణరావు, మండలాధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, నాయకులు సుర్ల వీరేంద్ర, గొర్లె వీరవెంకట్‌, దూనబోయిన రమణ, గాజుల శ్రీను, కిముడు కృష్ణమూర్తి, రాజుబాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:24 PM