అల్లం ధర పతనం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:30 PM
గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం జీకేవీధి వారపు సంతలో వర్తకులు కిలో రూ.20 ధరకు కొనుగోలు చేశారు.
గిరిజన రైతులు దిగాలు
కిలో రూ.20కి కొనుగోలు చేస్తున్న వర్తకులు
గూడెంకొత్తవీధి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం జీకేవీధి వారపు సంతలో వర్తకులు కిలో రూ.20 ధరకు కొనుగోలు చేశారు. ప్రతి ఏడాది గిరిజన రైతులు ఆగస్టు మాసంలో పాత అల్లం సేకరించి మార్కెటింగ్ చేస్తుంటారు. గత ఏడాది పాత అల్లం కిలో రూ.100కు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధర భారీగా తగ్గిపోవడంతో కనీసం కూలీ ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లం పంటను కేవలం ప్రైవేటు వర్తకులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కాఫీ తరహాలో అల్లం పంటకు ప్రభుత్వరంగ సంస్థలు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం లేదు. దీంతో ప్రైవేటు వర్తకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన రైతులు మైదాన ప్రాంతాలు, పట్టణాలకు తరలించి మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి లేక తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు.