సీఐఐ సదస్సులో జీసీసీ స్టాల్
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:17 AM
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సులో గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జీసీసీ ఉత్పత్తులు, అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేపథ్యంలో సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఐఐ సదస్సులో స్టాల్‌ను ఏర్పాటు చేయించారు.
సందర్శించిన పలువురు ప్రముఖులు
పాడేరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సులో గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జీసీసీ ఉత్పత్తులు, అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేపథ్యంలో సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఐఐ సదస్సులో స్టాల్‌ను ఏర్పాటు చేయించారు. తొలి రోజు శుక్రవారం సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు జీసీసీ స్టాల్‌ను సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సహకారంతో జీసీసీని బలోపేతం చేయడం ద్వారా గిరిజనులకు మరింత ప్రయోజనం కలుగుతుందని చైర్మన్ శ్రావణ్‌కుమార్ అన్నారు.