యంత్రంతో చెత్త శుద్ధి
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:13 AM
మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం డంపింగ్ యార్డులో టన్నుల కొద్ది చెత్తకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. కొండలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ట్రోమెల్ యంత్రం సహాయంతో శుద్ధి చేస్తున్నారు. గత టీడీపీ పాలనలో 2017లో ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేశారు. క్యూబ్ బయో ఎనర్జీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బయట విక్రయించేవారు.
నర్సీపట్నంలో పదేళ్లుగా పేరుకు పోయిన చెత్తకు విముక్తి
నర్సీపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం డంపింగ్ యార్డులో టన్నుల కొద్ది చెత్తకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. కొండలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ట్రోమెల్ యంత్రం సహాయంతో శుద్ధి చేస్తున్నారు. గత టీడీపీ పాలనలో 2017లో ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేశారు. క్యూబ్ బయో ఎనర్జీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బయట విక్రయించేవారు. మిగిలిన ఘన వ్యర్థాలు, పొడి చెత్తను డంపింగ్ యార్డులో పోగులు పెట్టారు. ఇది కొండలా పేరుకుపోయి ఏడెనిమిది వేల టన్నులకు చేరింది. తొలుత 6,250 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేసి.. చెత్త శుద్ధి చేసి తరలించడానికి తరుణీ అసోసియేట్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ యంత్రాల సహాయంతో చెత్తను శుద్ధి చేస్తున్నది. ఘన వ్యర్థాలు, మట్టి, పునరుద్పాక ఇందనం (ఆర్‌డీఎఫ్)గా వేరు చేస్తుంది. ఆర్‌డీఎఫ్‌ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కి తరలిస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో మునిసిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏ రోజు చెత్త ఆ రోజు శుద్ధి చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిసింది.