Share News

మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు ఛిద్రం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:36 AM

మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు ఛిద్రమవుతుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం ఎన్టీఆర్‌ స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండేలా విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు.

మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు ఛిద్రం
ప్రతిజ్ఞ చేస్తున ్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, తదితరులు

- కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు ఛిద్రమవుతుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం ఎన్టీఆర్‌ స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండేలా విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌ నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుజిత్‌సింగ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరముందన్నారు. విద్యార్థి దశ నుంచే కొంతమంది మత్తు పదార్ధాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం ఆయా పాఠశాలలు, కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణి, సీఐలు టీవీ విజయ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, వెంకటనారాయణ, అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:36 AM