ఐసీఎంఆర్ పరిశోధనకు నలుగురు వైద్య విద్యార్థుల ఎంపిక
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:42 PM
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చేసే పరిశోధనకు ఎంపికయ్యారు. ఎంపికైన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ రాధాకుమారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నియమ నిబంధనలను అనుసరించి పరిశోధనలు చేస్తారు.
పాడేరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చేసే పరిశోధనకు ఎంపికయ్యారు. ఎంపికైన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ రాధాకుమారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నియమ నిబంధనలను అనుసరించి పరిశోధనలు చేస్తారు. ఎంపికైన వైద్య విద్యార్థులు శశిముఖి గిరిజన చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిపై, ఆదిత్య గిరిజనుల్లో పోషకాహార లోపాలు, అంటువ్యాధులు, దిలీప్‌రెడ్డి గిరిజనుల్లో మధుమేహం, లక్ష్మీనారాయణ గిరిజన విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం, నిర్మూలన చర్యలు అనే అంశాలపై పరిశోధనలు చేస్తారు. గిరిజన ప్రాంతానికి చెందిన మెడికల్ కాలేజీ విద్యార్థులు ఐసీఎంఆర్ పరిశోధనలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతదేవి అన్నారు. ఈ సందర్భంగా వారిని వైస్ ప్రిన్సిపాల్ పాపారత్నం, సిబ్బంది అభినందించారు.