పాడేరులో అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:40 PM
పాడేరులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి గురువారం టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శంకుస్థాపన చేశారు.
పాడేరురూరల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): పాడేరులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి గురువారం టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శంకుస్థాపన చేశారు. పాడేరు అంబేడ్కర్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ రైతు బజారులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పాడేరులో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుందన్నారు. పాడేరుతో పాటు చింతపల్లిలో కూడా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామన్నారు. పాడేరుకు అన్న క్యాంటీన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా కృష్ణారావు, పాడేరు మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ మంచాల మంగతల్లి, టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బొర్రా విజయరాణి, పాడేరు పీఏసీఎస్ అధ్యక్షుడు డప్పోడి వెంకటరమణ, పాడేరు వైస్ ఎంపీపీ గంగపూజారి శివకుమార్, టీడీపీ అరకు పార్లమెంట్ మహిళా కార్యవర్గ సభ్యురాలు డిప్పల వెంకటకుమారి, లగిశపల్లి పంచాయతీ సర్పంచ్ లకే పార్వతమ్మ, జనసేన వీర మహిళలు పద్మావతి, దివ్యలత, కూటమి నాయకులు పాల్గొన్నారు.