జాతి వైరం మరచి..
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:26 AM
జాతి వైరాన్ని మరచి కుక్క వద్ద మేక పిల్లలు పాలు తాగుతున్న సంఘటన మండలంలోని ఇంజరి పంచాయతీ మల్లెపుట్టు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
జాతి వైరాన్ని మరచి కుక్క వద్ద మేక పిల్లలు పాలు తాగుతున్న సంఘటన మండలంలోని ఇంజరి పంచాయతీ మల్లెపుట్టు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఆకలితో ఉన్న మేక పిల్లలకు తల్లి మేక సమీపంలో కనిపించకపోయే సరికి అటుగా వెళుతున్న వీధి కుక్క వద్ద పాలు తాగాయి. ఆ కుక్క కూడా వాటిని ప్రేమగా సాకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.
- పెదబయలు/ఆంధ్రజ్యోతి