Share News

ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ విస్తృత పర్యటన

ABN , Publish Date - May 18 , 2025 | 12:35 AM

విశాఖపట్నం ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ బీఎం.మొయిద్దీన్‌ దివాన్‌(సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి) ఽశనివారం పర్యటించారు. ముఖ్యంగా పాడేరు, జి.మాడుగుల అటవీ ప్రాంతాల్లో తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పెంపకాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు.

 ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ విస్తృత పర్యటన
జి.మాడుగుల అటవీ ప్రాంతంలో మొక్కలను పరిశీలిస్తున్న కన్జర్వేటర్‌ బీఎం.మొయిద్దీన్‌ దివాన్‌

జి.మాడుగుల ప్రాంతంలో మొక్కలు పరిశీలన, పాడేరు డీఎఫ్‌వో కార్యాలయం సందర్శన

పాడేరు. మే 17(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ బీఎం.మొయిద్దీన్‌ దివాన్‌(సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి) ఽశనివారం పర్యటించారు. ముఖ్యంగా పాడేరు, జి.మాడుగుల అటవీ ప్రాంతాల్లో తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పెంపకాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అటవీ సిబ్బందికి సూచించారు. స్థానిక డివిజనల్‌ అటవీ అధికారి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో పీవీ.సందీప్‌రెడ్డి, అటవీ అధికారులు వి.లావణ్య, ఆర్‌.అప్పలనాయుడు, వి.వెంకయ్యచౌదరి, ఆర్‌.రాజేశ్వరరావు, టి.విజయకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:35 AM