అనుసంధాన రహదారులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:35 PM
భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేసే ప్రధాన రహదారుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేసే ప్రధాన రహదారుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్ ప్రణాళిక రహదారులను నిర్దేశించిన తొమ్మిది నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణ పనులు త్వరితంగా పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. వుడా పార్కులో జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో స్కేట్ బోర్డు పనులను సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో అడవివరం-శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ రహదారుల నిర్మాణ పనులను ప్రణవ్‌గోపాల్, తదితరులు పరిశీలించారు. ఈ పనులు త్వరితంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ వినయ్‌కుమార్, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీప్రసాద్, మధుసూదనరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ రవిశంకర్‌చ తదితరులు పాల్గొన్నారు.