Share News

అర్జీల పరిష్కారంపై దృష్టి

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:39 AM

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

అర్జీల పరిష్కారంపై దృష్టి
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌వో వై.సత్యనారాయణరావుతో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 276 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ అర్జీ నమోదు చేయాలన్నారు. ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖలు పరిష్కార దిశగా తీసుకుంటున్న చర్యలను నిరంతరం ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:39 AM