‘తాండవ’కు వరదపోటు
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:08 AM
తాండవ రిజర్వాయర్‌లోకి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు గెడ్డలు, వాగుల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున జలాశయంలోకి వచ్చి చేరుతున్నది. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులుకాగా, మంగళవారం 1,600 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది.
గెడ్డలు, వాగుల నుంచి 1,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 377 అడుగులు
మరో రెండు అడుగులు పెరిగితే స్పిల్ వే గేట్లు ఎత్తివేత
నాతవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తాండవ రిజర్వాయర్‌లోకి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు గెడ్డలు, వాగుల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున జలాశయంలోకి వచ్చి చేరుతున్నది. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులుకాగా, మంగళవారం 1,600 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో నీటిమట్టం 377 అడుగులకు చేరింది. ఆయకట్టుకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 537 క్యూలసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. అవుట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో మూడురెట్లు అధికంగా వుండడంతో రిజర్వాయర్‌లో నీటినిల్వలు పెరుగుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, జలాశయంలోకి వరద పోటెత్తితో పూర్తి నిండే అవకాశం వుంది. నీటిమట్టం 379 అడుగులకు చేరితే స్పిల్‌గేట్లు ఎత్తి అదనపు నీటిని తాండవ నదిలోకి విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడే అవకాశం లేదని అన్నారు. ఆయకట్టు చివరి భూములకు కూడా సకాలంలో నీరు అందుతుందని తెలిపారు.