జలాశయాలకు వరద
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:39 AM
మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువగా ఉంది. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు. కాగా గురువారం సాయంత్రానికి 136.50 మీటర్లకి చేరింది. ఇన్‌ఫ్లో 380 క్యూసెక్కులు నమోదైందని మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాత్రి తొమ్మిది గంటలకు జలాశయం మూడో గేటు తెరిచి 350 క్యూసెక్కులు నీరు విడిచిపెడుతున్నట్లు జలాశయం ఏఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
స్పిల్‌వే గేట్లు ఎత్తి.. దిగువకు విడుదల
మాడుగుల రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువగా ఉంది. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు. కాగా గురువారం సాయంత్రానికి 136.50 మీటర్లకి చేరింది. ఇన్‌ఫ్లో 380 క్యూసెక్కులు నమోదైందని మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాత్రి తొమ్మిది గంటలకు జలాశయం మూడో గేటు తెరిచి 350 క్యూసెక్కులు నీరు విడిచిపెడుతున్నట్లు జలాశయం ఏఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
కల్యాణపులోవకు 280 క్యూసెక్కుల వరద
రావికమతం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్యాణపులోవ జలాశయానికి వరద ప్రవాహం గురువారం కూడా కొనసాగింది. రిజర్వాయర్ గరిష్ఠ నీటమట్టం 460 అగులుకాగా, 280 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతున్నది. గురువారం నీటిమట్టం 458.08 అడుగుల వద్ద నిలకడగా వుంచుతూ, స్పిల్‌వేలో రెండు గేట్లు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 40 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు సరఫరా చేస్తున్నారు. రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లో సర్పా నదికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు జలాశయం ఏఈ డి.సూర్య తెలిపారు.
తాండవకు 567 క్యూసెక్కుల వరద
నాతవరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తాండవ రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 377.6 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో 567 క్యూసెక్కుల వదర నీరు వచ్చి చేరుతున్నది. కాలువల ద్వారా ఆయకట్టుకు ఇంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించినందున గురువారం రాత్రి నుంచి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం వుందని ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు.