పైడిపాల శివాలయంలోకి వరద
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:57 AM
మండలంలోని పలుగ్రామాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. పైడిపాల గ్రామంలో కొండగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జంక్షన్‌లో ఉన్న వాగలింగేశ్వర శివాలయంలోకి వరద పోటెత్తింది. నందీశ్వరునితోపాటు గర్భగుడితో శివలింగం నీట మునిగాయి.
నీటమునిగిన శివలింగం, నందీశ్వరుడు
మాకవరపాలెం అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలుగ్రామాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. పైడిపాల గ్రామంలో కొండగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జంక్షన్‌లో ఉన్న వాగలింగేశ్వర శివాలయంలోకి వరద పోటెత్తింది. నందీశ్వరునితోపాటు గర్భగుడితో శివలింగం నీట మునిగాయి. రామన్నపాలెం గ్రామంలోకి వెళ్లే ఏలేరు కాలువ వంతెనపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. జి.కోడూరు గ్రామంలోని పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. తూటిపాలలో చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరస్థాయికి చేరడంతో తహశీల్దార్ వెంకటరమణ, సర్పంచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వరద నివారణ చర్యలు చేపట్టారు.