Share News

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:54 AM

జిల్లాలో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒక బాలుడు గెడ్డలోపడి గల్లంతయ్యాడు. ఎస్‌.రాయవరం మండలంని గెడ్డపాలెం జంక్షన్‌ సమీపంలో వ్యాన్‌ ఢీకొనడంతో కొబ్బరికాయల వ్యాపారి మృతిచెందాడు. నర్సీపట్నంలో ఒక ద్విచక్ర వాహన షోరూమ్‌లో వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పరవాడ మండలం ధర్మారాయుడుపేట జంక్షన్‌కు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొనడంతో అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం అర్ధరాత్రి అనకాపల్లి ఉడ్‌పేట వద్ద డ్రైనేజీలో పడి వ్యక్తి బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. నాతవరంలో తాండవ ఎడమ కాలువలో స్నానానికి దిగిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు. బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట తాచేరు కాజ్‌వే వద్ద వరద ప్రవాహంలో పడి ఎనిమిదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు.

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

(23ఎస్‌ఆర్‌వీఎం2)సోమిరెడ్డి నాగేశ్వరరావు (ఫైల్‌ ఫొటో)

23ఎన్‌టివి1ఏ: దుండు తేజ (ఫైల్‌ ఫొటో)

23ఎన్‌పీ4: దన్నిన వంశీ ( ఫైల్‌ పొటో)

23పీవీడీ-4: కొల్లి బాబురావు (ఫైల్‌ ఫొటో)

23బిపిటి2: ఆడారి రోహిత్‌ (ఫైల్‌ ఫొటో)

తాచేరు గెడ్డలో పడి విద్యార్థి గల్లంతు

-------

జిల్లాలో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒక బాలుడు గెడ్డలోపడి గల్లంతయ్యాడు. ఎస్‌.రాయవరం మండలంని గెడ్డపాలెం జంక్షన్‌ సమీపంలో వ్యాన్‌ ఢీకొనడంతో కొబ్బరికాయల వ్యాపారి మృతిచెందాడు. నర్సీపట్నంలో ఒక ద్విచక్ర వాహన షోరూమ్‌లో వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పరవాడ మండలం ధర్మారాయుడుపేట జంక్షన్‌కు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొనడంతో అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం అర్ధరాత్రి అనకాపల్లి ఉడ్‌పేట వద్ద డ్రైనేజీలో పడి వ్యక్తి బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. నాతవరంలో తాండవ ఎడమ కాలువలో స్నానానికి దిగిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు. బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట తాచేరు కాజ్‌వే వద్ద వరద ప్రవాహంలో పడి ఎనిమిదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు.

----

వ్యాన్‌ ఢీకొని కొబ్బరి కాయల వ్యాపారి మృతి

ఎస్‌.రాయవరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గెడ్డపాలెం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొబ్బరికాయల వ్యాపారి మృతిచెందాడు. ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి నాగేశ్వరరావు (58), విశాఖలో నివాసం వుంటున్న తన తమ్ముడు శ్రీనుతో కలిసి కొబ్బరి తోటలను లీజుకు తీసుకొని కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నారు. కొబ్బరికాయల తీతకు సంబంఽధించి ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మంగళవారం మధ్యాహ్నం గోకులపాడు వెళ్లారు. తరువాత తమ్ముడు విశాఖ వెళ్లేందుకు అడ్డరోడ్డు జంక్షన్‌లో దింపిన నాగేశ్వరరావు, తిరిగి ఇంటికి వెళుతున్నాడు. గెడ్డపాలెం జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వస్తున్న వ్యాన్‌, బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కన గోతిలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్‌లో నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నర్సీపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహన షోరూమ్‌లో వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. పట్టణంలోని వెంకునాయుడుపేటలో నివాసం వుంటున్న దన్నిన వంశీ పెదబొడ్డేపల్లిలోని సుజుకి బైక్‌ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం షోరూమ్‌కి వెళ్లాడు. తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ.. మధ్యాహ్నం 3.30 గంటలకు అదే షోరూమ్‌లో పని చేస్తున్న ప్రవీణ్‌, వేణు వెంకునాయుడుపేటలో వంశీ తండ్రి గోవింద్‌ వద్దకు వచ్చారు. వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌షర్క్యూట్‌ జరిగి వంశీ కింద పడిపోయాడని, వెంటనే ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకు వెళ్లామని చెప్పారు. దీంతో వంశీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే వంశీ చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. చేతికి అందివచ్చిన ఒక్కొగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. గోవింద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాచేరు గెడ్డలో పడి విద్యార్థి గల్లంతు

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట తాచేరు కాజ్‌వే వద్ద వరద ప్రవాహంలో పడి ఎనిమిదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి. విజయరామరాజుపేటకు చెందిన ఆడారి గోపి కుమారుడు రోహిత్‌ (13) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో, మంగళవారం ఉదయం తన తమ్ముడు లోహిత్‌ కలిసి గ్రామానికి సమీపంలో వున్న తాచేరు కాజ్‌వే వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెప్పు జారిపోయి నీటిలో పడడంతో దానిని తీసుకోవడానికి రోహిత్‌ గెడ్డలోకి దిగాడు. ఈ సమయంలో వరద ప్రవాహం ఉధృతంగా వుండడంతో గల్లంతయ్యాడు. దీంతో భయాందోళన చెందిన లోహిత్‌ వెంటనే ఇంటికి వెళ్లి అన్న నీటిలో పడి గల్లంతైన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారితోపాటు మరికొంతమంది గ్రామస్థులు కాజ్‌వే వద్దకు వచ్చి చూశారు. రోహిత్‌ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గత ఈతగాళ్ల సాయంతో తాచేరుతోపాటు పెద్దేరు నదిలో కూడా గాలించారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాలీ.. ఒకరి మృతి

పరవాడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మారాయుడుపేట జంక్షన్‌కు సమీపంలో ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన కొల్లి బాబురావు (54) పరవాడ ఫార్మాసిటీలో లేబర్‌ పనులు నిర్వహిస్తున్న ఒక కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ధర్మారాయుడుపేట జంక్షన్‌ సమీపంలోకి వచ్చే సరికి అచ్యుతాపురం వైపు నుంచి వస్తున్న ట్రాలీ లారీ ఢీకొన్నది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబురావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకుసీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి డ్రైనేజీ కాలువలో పడి..

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉడ్‌పేట వద్ద గల డ్రైనేజీలో సోమవారం అర్ధరాత్రి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతిచెందాడు. పట్టణ ఎస్‌ఐ కె.సంతోశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన బొట్టా సత్తిబాబు అలియాస్‌ సతీశ్‌ (35) వివిధ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతుంటారు. కూలీ పని కోసం అనకాపల్లి వచ్చిన సత్తిబాబు సోమవారం అర్ధరాత్రి ఉడ్‌పేట వద్ద డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి, డ్రైనేజీలో నుంచి సతీశ్‌ను బయటకు తీసి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అనకాపల్లి వచ్చి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లారు. సతీశ్‌ తండ్రి మహాలక్ష్మినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ తెలిపారు.

తాండవ కాలువలో మునిగి యువకుడి మృతి

నాతవరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తాండవ ఎడమ కాలువలో పడి యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం నాతవరం గ్రామానికి చెందిన దండు తేజ (31) సోమవారం సాయంత్రం స్థానిక గ్యాస్‌ గోదాము ఎదురుగా తాండవ కాలువలో స్నానానికి దిగాడు. ఇక్కడ కాలువ లోతు ఎక్కువ వుండడంతోపాటు తేజకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అక్కడకు కొద్ది దూరంలో కల్వర్టు వద్ద మృతదేహం తేలింది. తేజ తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Sep 24 , 2025 | 12:54 AM