మత్స్యకారులు రియల్ హీరోలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:15 AM
నిత్యం కడలి కెరటాలపై చేపల వేట సాగించే మత్స్యకారులు రియల్ హీరోలని, వారు ఎటువంటి కల్మషం లేని వారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నక్కపల్లిలో కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌తో కలిసి జిల్లాలో 12,644 మందికి పైగా మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25,28,80,000 వేట నిషేధ పరిహారం చెక్కును ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ పరిహారం రూ.4 వేలు ఇచ్చామని, ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు దానిని రూ.20 వేలకు పెంచామన్నారు.
- హోం మంత్రి అనిత
- జిల్లాలో రూ.25.28 కోట్ల వేట నిషేధ భృతి పంపిణీ
నక్కపల్లి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నిత్యం కడలి కెరటాలపై చేపల వేట సాగించే మత్స్యకారులు రియల్ హీరోలని, వారు ఎటువంటి కల్మషం లేని వారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నక్కపల్లిలో కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌తో కలిసి జిల్లాలో 12,644 మందికి పైగా మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25,28,80,000 వేట నిషేధ పరిహారం చెక్కును ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ పరిహారం రూ.4 వేలు ఇచ్చామని, ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు దానిని రూ.20 వేలకు పెంచామన్నారు. యాభై ఏళ్ల వయస్సు నిండిన మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మత్స్యకారులు చేపలు విక్రయించడానికి వీలుగా అడ్డరోడ్డులో షెడ్ నిర్మిస్తామని, మత్స్యకారుల పిల్లల కోసం రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తీర ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని, మత్స్యకార ఓట్లు అధికంగా వున్న పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోటన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, నియోజకవర్గం మత్స్యకార నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.