Share News

ఉప్పుటేరులో మత్స్యఘోష

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:44 AM

మండలంలోని పూడిమడక ఉప్పుటేరులో మరోసారి చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఫార్మా కంపెనీల నుంచి విడుదల చేస్తున్న ద్రవ రసాయన వ్యర్థాల కారణంగానే చేపలు చనిపోతున్నాయని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు కొన్ని పరిశ్రమల నిర్వాహకులు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా, ట్యాంకర్లతో రాత్రిపూట బయటకు తీసుకువచ్చి ఉప్పుటేరులో కలిపేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.ప మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో కాంపెనీల్లో నుంచి విడుదల చేస్తున్న కాలుష్య రసాయన వ్యర్థాల కారణంగా చేపలు చనిపోతున్నాయని అన్నారు.

ఉప్పుటేరులో మత్స్యఘోష
ఉప్పుటేరు వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు.

సెజ్‌ పరిశ్రమల కాలుష్యంతో చేపలు మృత్యువాత

అధికారులు పట్టించుకోవడం లేదని మత్స్యకారుల ఆందోళన

అచ్యుతాపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడిమడక ఉప్పుటేరులో మరోసారి చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఫార్మా కంపెనీల నుంచి విడుదల చేస్తున్న ద్రవ రసాయన వ్యర్థాల కారణంగానే చేపలు చనిపోతున్నాయని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు కొన్ని పరిశ్రమల నిర్వాహకులు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా, ట్యాంకర్లతో రాత్రిపూట బయటకు తీసుకువచ్చి ఉప్పుటేరులో కలిపేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.ప మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో కాంపెనీల్లో నుంచి విడుదల చేస్తున్న కాలుష్య రసాయన వ్యర్థాల కారణంగా చేపలు చనిపోతున్నాయని అన్నారు. గురువారం ఉప్పుటేరులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి, తీరానికి కొట్టుకువచ్చిన చోటుకు మత్స్యకార నాయకులు వెళ్లి పరిశీలించారు. ఈ సమస్యను గతంలో పలుమార్లు ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే సెజ్‌ ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిడి అప్పారావు, ఉమ్మిడి జగన్‌, దేముడు, మహేష్‌, వై శ్రీను, అచ్చయ్య, పోలయ్య, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:45 AM