Share News

జీడిమామిడి తోటల్లో అగ్గి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:33 AM

మండలంలోని ఎల్‌బీపీ అగ్రహారం, బంగారుమెట్ట గ్రామాల సరిహద్దులోని జీడిమామిడి తోటల్లో గురువారం అగ్గిరాజుకుంది. సుమారు 50 ఎకరాల్లో తోటలు దగ్ధమయ్యాయి. మధ్యాహ ్నం వరకు తోటల్లో వున్న రైతులు.. భోజనం చేయడానికి ఇళ్లకు వెళ్లారు.

జీడిమామిడి తోటల్లో అగ్గి
కాలిపోయిన జీడిమామిడి తోట

50 ఎకరాల్లో కాలిపోయిన పంట

రూ.50 లక్షలకుపైగా నష్టం

బుచ్చెయ్యపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్‌బీపీ అగ్రహారం, బంగారుమెట్ట గ్రామాల సరిహద్దులోని జీడిమామిడి తోటల్లో గురువారం అగ్గిరాజుకుంది. సుమారు 50 ఎకరాల్లో తోటలు దగ్ధమయ్యాయి. మధ్యాహ ్నం వరకు తోటల్లో వున్న రైతులు.. భోజనం చేయడానికి ఇళ్లకు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత ఒకరిద్దరు రైతులు తిరిగి తోటల వద్దకు తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో జీడిమామిడి తోటల్లో నుంచి పొగ, మంటలు ఎగిసిపడుతుండడంతో ఆందోళన చెంది పరుగు పరుగు అక్కడకు వెళ్లారు. మంటలు ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రావికమతం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఫైర్‌ స్టేషన్‌ నుంచి సిబ్బంది వచ్చే సరికి తోటలన్నీ కాలిపోయాయి. కనిమిరెడ్డి దొంగబాబు, సత్తిబాబు, రాము, కురచా వరహాలు, మరికొంతమంది రైతులకు చెందిన సుమారు 50 ఎకరాల జీడిమామిడి తోటలు కాలిపోయాయి. ఈ ఏడాది కాపు బాగుందని, ఎకరాకు 15 బస్తాల వరకు జీడిపిక్కలు వస్తాయని భావించామని రైతులు చెప్పారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియడంలేదని, కానీ ఎకరాకు లక్ష రూపాయలకుపైగా నష్టపోయామని వాపోయారు.

Updated Date - Mar 21 , 2025 | 12:33 AM