కశింకోట పూర్వ కార్యదర్శి ఆర్థిక అవకతవకలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:13 AM
మేజర్ పంచాయతీ కశింకోటలో కార్యదర్శిగా పని చేసిన ఎస్.రామచంద్రరావు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు డిప్యూటీ ఎంపీడీవో తోటారావు కలెక్టర్ విజయకృష్ణన్‌కు, డీపీవో సందీప్‌కు, ఎంపీడీవో చుక్కా చంద్రశేఖరరావుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భీమునిపట్నం మండలం చిప్పాడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రామచంద్రరావు.. కశింకోట నుంచి రిలీవ్ అయిన సమయంలో పంచాయతీకి సంబంధించి రికార్డులను పూర్తిస్తాయిలో సమర్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇళ్ల పన్నులకు సంబంధించి రూ.20,60,215 జమచేయని వైనం
కలెక్టర్‌కు, డీపీవోకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ ఎంపీడీవో
ప్రస్తుతం భీమిలి మండలం చిప్పాడలో పనిచేస్తున్న కార్యదర్శి
కశింకోట, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ కశింకోటలో కార్యదర్శిగా పని చేసిన ఎస్.రామచంద్రరావు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు డిప్యూటీ ఎంపీడీవో తోటారావు కలెక్టర్ విజయకృష్ణన్‌కు, డీపీవో సందీప్‌కు, ఎంపీడీవో చుక్కా చంద్రశేఖరరావుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భీమునిపట్నం మండలం చిప్పాడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రామచంద్రరావు.. కశింకోట నుంచి రిలీవ్ అయిన సమయంలో పంచాయతీకి సంబంధించి రికార్డులను పూర్తిస్తాయిలో సమర్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 మార్చి 31వ తేదీ వరకు ఆస్తి పన్ను రూపేణా రూ.55,41,693 కాగా, రూ.34,81,478 మాత్రమే ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారని తెలిపారు. మిగిలిన రూ.20,60,215 ఇంతవరకు జమ చేయలేదని పేర్కొన్నారు. అదే విధంగా 2024-25 ఇళ్ల పన్నులకు సంబంధించి రికార్డులను సరిగా నిర్వహించలేదని, 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి క్యాష్ బుక్ నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. ఇంకా వివిధ పనుల పేరుతో డ్రా చేసిన డబ్బులకు సంబంధించి ఎటువంటి సంతకాలు లేవని పేర్కొన్నారు. పరికరాలు, ఇతర సామాగ్రి కొనుగోలుచేసి, స్టాక్ రిజిస్టర్‌లు నిర్వహించలేదని, వీటిపై పలుమార్లు సమాచారం అడిగినా స్పందించలేదని, దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని డిప్యూటీ ఎంపీడీవో తోటారావు పేర్కొన్నారు.