Share News

మల్లవరం ఛానల్‌ గండిని వెంటనే పూడ్చండి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:28 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని జల్లూరు వంతెన వద్ద గండి పడిన మల్లవరం ఛానల్‌ను సోమవారం శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.

మల్లవరం ఛానల్‌ గండిని వెంటనే పూడ్చండి
జల్లూరు వంతెన వద్ద మల్లవరం కాలువకు పడిన గండిని పరిశీలిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

అధికారులకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆదేశం

కోటవురట్ల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని జల్లూరు వంతెన వద్ద గండి పడిన మల్లవరం ఛానల్‌ను సోమవారం శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. గండిని వెంటనే పూడ్చాలని, శాశ్వత మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాండవ రిజర్వాయర్‌ గేట్లు, పంట కాలువల అభివృద్ధి ఏడాది కాలంలో రూ.6.3 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. మరో 25 పనులు చేపట్టడానికి రూ.2.66 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు, ఆర్డీవో వీవీ రమణ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు, కూటమి నాయకులు వున్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:28 AM