బల్క్‌డ్రగ్ పార్కు రద్దు చేసే వరకూ పోరాటం
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:08 AM
ప్రజలకు, పర్యావరణానికి, సముద్రానికి హాని కల్గించే బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేసే వరకూ పోరాటం సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం మత్స్యకారుల నిరసన శిబిరాన్ని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాఽథం సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నక్కపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు, పర్యావరణానికి, సముద్రానికి హాని కల్గించే బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేసే వరకూ పోరాటం సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం మత్స్యకారుల నిరసన శిబిరాన్ని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాఽథం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భుజం కాస్తూ, ప్రజలను, ప్రకృతిని నాశనం చేసేందుకు పూనుకోవడం చాలా దారుణమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జీ కోటేశ్వరరావు, సీపీఎం నేత ఎం.అప్పలరాజు మత్స్యకార నాయకులు ఎరుపల్లి నాగేశ్, తదితరులు పాల్గొన్నారు,
పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి
మాకవరపాలెం: ప్రజల సొమ్ముతో ప్రైవేటు వారి పెత్తనం చేయడంతో ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని భీమబోయినపాలెం గ్రామంలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు కూటిమి ప్రభుత్వం యఽథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానం గంగవరం పోర్టు పనులు చేపట్టి చివరకు ఏమి చేశారో అందరికీ తెలుసున్నారు. మెడికల్ కాలేజి పనులను రూ.500 కోట్లతో చేపట్టారని, ఈ పనులు 50 శాతం పూర్తి చేశారన్నారు.మిగిలిన నిర్మాణ పనులను పీపీపీకి అప్పగించడం సరికాదన్నారు. పేద ప్రజలకు విద్యా, వైద్యం ఎంతో అవసరమని, అలాంటిది ఈ రెండు పేదలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈనెల 21వ తేదీన విజయవాడలో జరిగే రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో మాట్లాడతామన్నారు.