యూరియా కోసం తోపులాట
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:06 AM
యూరియా కోసం రైతులు ఎగబడడంతో పట్టణంలోని రెండు ఎరువుల దుకాణాల వద్ద మంగళవారం పోలీసు బందోబస్తు నడుమ యూరియా విక్రయించారు. కొత్తూరు జంక్షన్ ీఎస్‌పేట రోడ్డులోని దుకాణాలకు ఎరువుల స్టాకు వచ్చిందన్న సమాచారంతో ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దుకాణాలు తెరిచే సమయానికి మరింతమంది రైతులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా దుకాణాల వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్డారు.
పోలీసు బందోబస్తు మధ్య విక్రయాలు
కొద్ది గంటల్లోనే 67 టన్నుల యూరియా అమ్మకం
చోడవరం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఎగబడడంతో పట్టణంలోని రెండు ఎరువుల దుకాణాల వద్ద మంగళవారం పోలీసు బందోబస్తు నడుమ యూరియా విక్రయించారు. కొత్తూరు జంక్షన్ ీఎస్‌పేట రోడ్డులోని దుకాణాలకు ఎరువుల స్టాకు వచ్చిందన్న సమాచారంతో ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దుకాణాలు తెరిచే సమయానికి మరింతమంది రైతులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా దుకాణాల వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్డారు. రైతులను వరుసలో నిలుచోబెట్టి, వ్యవసాయ శాఖ ఏవో పావని ఆధ్వర్యంలో యూరియా విక్రయించారు. మన గ్రోమోర్ సెంటర్‌తోపాటు మరో రెండు దుకాణాలకు 67 టన్నుల యూరియా రాగా, గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. చోడవరంతోపాటు, చీడికాడ, కె.కోటపాడు మండలాల నుంచి కూడా రైతులు రావడంతో దుకాణాల వద్ద తోపులాట చోటు చేసుకుంది. కాగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు యూరియా పంపిణీ కానీ నరసయ్యపేటలో మంగళవారం 12 టన్నులు, దుడ్డుపాలెంలో 12 టన్నులు యూరియా పంపిణీ చేపట్టారు. లక్ష్మీపురం, గవరవరంలలో చెరో పది టన్నుల చొప్పున పంపిణీ చేయగా, బుధవారం ఖండేపల్లిలో యూరియా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో మండలానికి మరింత యూరియా వస్తుందని వ్యవసాయాధికారులు చెప్పారు.