నర్సీపట్నంలో నకిలీ కరెన్సీ కలకలం
ABN , Publish Date - May 19 , 2025 | 11:26 PM
స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ ఉపాధ్యాయుడు బైక్‌కి దొంగనోట్లు ఉన్న బ్యాగ్ తగిలించి వెళ్లిపోవడం కలకం సృష్టించింది. పట్టణ సీఐ గోవిందరావు అందించిన వివరాలాలా ఉన్నాయి.
నర్సీపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ ఉపాధ్యాయుడు బైక్‌కి దొంగనోట్లు ఉన్న బ్యాగ్ తగిలించి వెళ్లిపోవడం కలకం సృష్టించింది. పట్టణ సీఐ గోవిందరావు అందించిన వివరాలాలా ఉన్నాయి. రావికమతం మండలం కొత్తకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న కె.సాంబశివ, నర్సీపట్నం కొత్తవీధిలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం తన భార్యను బస్సు ఎక్కించడానికి బైక్ మీద ఆర్టీసీ బస్ స్టేషన్‌కి వెళ్లారు. బస్సు ఎక్కించిన తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే బైక్‌కు ఒక సంచి తగిలించి ఉంది. దానిలో జీన్ ఫ్యాంట్, టీ షర్టు కనిపించాయి. వీటి మధ్యలో ఒక కవర్లో చుట్టిన రూ.500 నోట్ల కట్టలు రెండు కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆయన తెలిసిన న్యాయవాది సలహా మేరకు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంచిని అప్పగించారు. సంచిలో ఉన్నవి నకిలీ నోట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌కు సంచిని తగిలించి వెళ్లిపోవడం కనిపించిందని, వారు ఎవరన్నది స్పష్టంగా కనిపించడం లేదని సీఐ గోవిందరావు చెప్పారు.