Share News

ఉపాధి కూలీలకు ముఖ ఆధారిత హాజరు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:49 AM

ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ పూర్ణిమాదేవి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆనకాపల్లి, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం, రావికమతం మండలాల ఏపీవోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఉపాధి కూలీలకు ముఖ ఆధారిత హాజరు
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ పూర్ణిమాదేవి

అక్రమాలు, బినామీలకు అడ్డుకట్ట

డ్వామా పీడీ పూర్ణిమాదేవి

సబ్బవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ పూర్ణిమాదేవి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆనకాపల్లి, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం, రావికమతం మండలాల ఏపీవోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ అఽధారిత హాజరుతో అక్రమాలను, బినామీలను అరికట్టవచ్చని అన్నారు. ఉపాధి పనులు తప్పనిసరిగా రెండు పూటలా చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలకు రోజుకు కనీసం రూ.300 వేతనం లభించేలా పనులు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఏపీడీ మణికుమార్‌, ఏపీవో వసంతకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:49 AM