Share News

విస్తృతంగా వాహనాల తనిఖీ

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:22 AM

జీకేవీధి మండలం సీలేరులో బుధవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు.

విస్తృతంగా వాహనాల తనిఖీ
సీలేరులోని ఐటీఐ జంక్షన్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

మావోయిస్టుల బ్యానర్‌ కలకలం రేపిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

సీలేరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో బుధవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో డుడుమకు వెళ్లే మార్గంలో ముంచంగిపుట్టు మండలం కుమ్మిపుట్టు వద్ద మావోయిస్టుల బ్యానర్‌ కలకలం రేపిన నేపథ్యంలో ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం సీలేరులో ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఐటీఐ జంక్షన్‌ వద్ద మోహరించి ఏవోబీ సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చీపోయే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. గ్రామానికి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

Updated Date - Dec 11 , 2025 | 12:22 AM