Share News

కనకమహాలక్ష్మి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:24 AM

మార్గశిర మాసం ఆఖరు గురువారం వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నవంబరు 21న మొదలైన మార్గశిర మాసం ఈ నెల 19 (శుక్రవారం)తో ముగియనుంది. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కనకమహాలక్ష్మి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు

నేడు మార్గశిర మాసంలో ఆఖరు గురువారం

కనకమహాలక్ష్మి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు

భక్తులకు విస్తృత ఏర్పాట్లు

20 వేల మందికి అన్నదానం

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

మార్గశిర మాసం ఆఖరు గురువారం వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నవంబరు 21న మొదలైన మార్గశిర మాసం ఈ నెల 19 (శుక్రవారం)తో ముగియనుంది. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో దర్శనాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఏడాది మొదటి గురువారం (నవంబరు 27) 28,445 మంది దర్శించుకున్నారు. రెండో గురువారం (డిసెంబరు 4) 50,158 మంది, మూడో గురువారం (డిసెంబరు 11) 40,980 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఆఖరు గురువారం నిమిషానికి ఐదుగురికి చొప్పున 60 వేల మందికి దర్శనాలు చేయించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఈఓ శోభారాణి తెలిపారు. అందుకు తగిన విధంగా క్యూలైన్లు పెట్టామన్నారు. జగన్నాథస్వామి ఆలయం వద్ద గురువారం మధ్యాహ్నం 20 వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. గురువారం సాయంత్రం సహస్ర ఘటాభిషేకం, శుక్రవారం సహస్ర దీపాలంకరణలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 01:24 AM