వీఎంఆర్‌డీఏ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:00 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ ప్రణవ్ గోపాల్ పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
మరో ఏడాది అవకాశం
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ ప్రణవ్ గోపాల్ పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ప్రణవ్ గోపాల్‌ను వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ఏడాది కాలానికి నియమించిన సంగతి తెలిసిందే. ఆ గడువు నవంబరు 20వ తేదీతో ముగిసిపోనున్న తరుణంలో మరో ఏడాది పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన సేవలు గుర్తించి పొడిగింపు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి కనెక్ట్ అయ్యే మాస్టర్ ప్లాన్ రహదారులన్నింటినీ స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో వచ్చే జూన్ నాటికి పూర్తిచేస్తామన్నారు.