ఢిల్లీలో పేలుడు.. జిల్లా పోలీసులు అప్రమత్తం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:51 AM
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి సంభవించిన భారీ పేలుడుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
రైల్వేస్టేషన్‌లో ముమ్మరంగా తనిఖీలు
అనకాపల్లి టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) :
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి సంభవించిన భారీ పేలుడుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి తొమ్మిది నుంచి అనకాపల్లికి వచ్చే రైళ్లల్లో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ నవీన్, సిబ్బంది విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ప్రతి బోగీలో ప్రయాణికులకు చెందిన లగేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులను ప్రశ్నించడంతోపాటు ప్లాట్‌ఫారంపై ఉన్న వారి వస్తువులను కూడా తనిఖీలు చేశారు.