Share News

స్వస్థ్‌ నారీ వైద్య శిబిరానికి విశేష స్పందన

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:29 PM

పాడేరులోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన స్వస్థ్‌ నారీ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

స్వస్థ్‌ నారీ వైద్య శిబిరానికి విశేష స్పందన
వైద్య శిబిరంలో రోగితో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

496 మందికి ప్రత్యేక వైద్య సేవలు

పాడేరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాడేరులోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన స్వస్థ్‌ నారీ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.హేమలతదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 496 మంది వచ్చి వైద్య సేవలు పొందారు. వారిలో వివిధ పరీక్షల నిమిత్తం 29 మందిని రిఫరల్‌కు సిఫారసు చేయగా, మరో ఐదుగురికి అవసరమైన ఆపరేషన్లను స్థానిక ఆస్పత్రిలోనే చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్వస్థ్‌ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జానపద కళల, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వి.గంగులయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ టి.నరసింగరావు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ఏఎంసీ చైర్మన్‌ డి.వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, వైద్య నిపుణులు, సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:29 PM