ఉష్ణోగ్రతలు పెరిగినా.... తగ్గని పొగమంచు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:39 PM
వాతావరణంలోని మార్పులతో శుక్రవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పెరిగినా పొగమంచు మాత్రం తగ్గలేదు.
జి.మాడుగులలో 13.4 డిగ్రీలు నమోదు
పాడేరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో శుక్రవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పెరిగినా పొగమంచు మాత్రం తగ్గలేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగానే కురిసింది. దీంతో వాహనాలు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. అయితే గత రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో చలి ప్రభావం మాత్రం కాస్తా తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జి.మాడుగులలో 13.4 డిగ్రీలు
వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం జి.మాడుగులలో 13.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపుట్టులో 14.2, హుకుంపేటలో 14.7, అరకులోయలో 14.8, డుంబ్రిగుడలో 15.0, చింతపల్లిలో 15.5, పాడేరు, పెదబయలులో 15.9, కొయ్యూరులో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.