తుఫాన్ పంట నష్టంపై తేలిన లెక్క
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:42 AM
గత వారం సంభవించిన ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సర్వే పూర్తిచేశారు. మొత్తం 3,553 మంది రైతులకు సంబంధించి 649.84 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించామని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
649.84 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్
రైతు సేవా కేంద్రాల్లో జాబితాలు
అనకాపల్లి రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గత వారం సంభవించిన ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సర్వే పూర్తిచేశారు. మొత్తం 3,553 మంది రైతులకు సంబంధించి 649.84 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించామని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల వివరాలను ఆధారంగా పంట నష్టం నమోదు వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపరిచినట్టు చెప్పారు. ఈ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కోసం అందుబాటులో వుంచినట్టు పేర్కొన్నారు. రైతులు ఎవరైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు చేస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆమె చెప్పారు.