ఏయూ వెబ్‌సైట్‌లో తప్పులు
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:27 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తప్పులు దొర్లుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ ఎస్.పాల్ డగ్లస్ వ్యవహరిస్తున్నారు.
విదేశీ విద్యార్థుల వ్యవహారాల విభాగం డీన్
ప్రొఫెసర్ ఎస్.పాల్ డగ్లస్ కాగా ధనుంజయరావు పేరు
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తప్పులు దొర్లుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ ఎస్.పాల్ డగ్లస్ వ్యవహరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల వ్యవహారాల విభాగ పేజీ ఓపెన్ చేసిన వెంటనే ఆయన ఫొటోతో వివరాలు ఉన్నాయి. అయితే, పేజీ కిందకు వెళితే కాంటాక్టు వివరాల్లో ప్రస్తుత డీన్, అసోసియేట్ డీన్లకు సంబంధించిన వివరాలకు బదులుగా పూర్వ డీన్ ప్రొఫెసర్ ఈఎన్ ధనుంజయరావు పేరు, ఫోన్ నంబర్, అలాగే, పూర్వ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ కె.ఈశ్వర్‌కుమార్ పేరు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత అసోసియేట్ డీన్లు ఎవరన్న వివరాలు ఈ పేజీలో లేవు. వర్సిటీలో ప్రతిష్టాత్మకంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలో కనీసం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ పేజీని కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒక డీన్, ఒక అసోసియేట్ డీన్ మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఒక డీన్, ఇద్దరు అసోసియేట్ డీన్లు ఉన్నప్పటికీ వెబ్‌సైట్‌లో మార్చలేదు.