Share News

ఐక్యతతో డ్రగ్స్‌ నిర్మూలన

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:46 AM

డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా పోలీస్‌ శాఖ చేపట్టిన ‘అభ్యుదయం సైకిల్‌ యాత్ర’ ప్రజా ఉద్యమంలా మారిందని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి అన్నారు. అభ్యుదయ సైకిల్‌ యాత్రలో భాగంగా మంగళవారం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ‘డ్రగ్స్‌ ఫ్రీ’ సందేశం చేరడమే ఈ యాత్ర లక్ష్యమని అన్నారు. యావత్‌ సమాజం కలిసికట్టుగా పనిచేస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించగలమన్నారు.

ఐక్యతతో డ్రగ్స్‌ నిర్మూలన
సైకిల్‌ యాత్రలో డీఐజీ గోపీనాథ్‌ జట్టి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎస్పీ తుహిన్‌సిన్హా

ప్రజా ఉద్యమంగా మారిన ‘అభ్యుదయం సైకిల్‌ యాత్ర’

డీఐజీ గోపీనాథ్‌ జట్టి

అనకాపల్లి టౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా పోలీస్‌ శాఖ చేపట్టిన ‘అభ్యుదయం సైకిల్‌ యాత్ర’ ప్రజా ఉద్యమంలా మారిందని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి అన్నారు. అభ్యుదయ సైకిల్‌ యాత్రలో భాగంగా మంగళవారం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ‘డ్రగ్స్‌ ఫ్రీ’ సందేశం చేరడమే ఈ యాత్ర లక్ష్యమని అన్నారు. యావత్‌ సమాజం కలిసికట్టుగా పనిచేస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించగలమన్నారు. గంజాయి కేసులకు సంబంధించి రేంజ్‌ పరిధిలో గత ఏడాది 2,500 మందిని అరెస్టు చేయగా, వీరిలో 77 మందికి 20 ఏళ్లపాటు జైలు పడిందన్నారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, డ్రగ్స్‌తోపాటు సోషల్‌ మీడియా సహా దేనికైనా బానిసలుగా మారకూడదని విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, దశాబ్ద కాలంలో డ్రగ్స్‌ వినియోగం 200 శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈగల్‌ టీమ్‌ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం తగ్గాయని అన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ, డ్రగ్స్‌ పై సమాచారం ఇవ్వడానికి 112 లేదా 1972 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. డ్రగ్స్‌ బారి నుంచి యువతను రక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ ర్యాలీని ప్రారంభించారు. డీఐజీ, ఎస్పీ, కలెక్టర్‌, ఎమ్మెల్యే, తదితరులు సైకిళ్లు తొక్కుతూ మెయిన్‌రోడ్డు మీదుగా నెహ్రూచౌక్‌ వరకు యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌యూఎఫ్‌ఐడీ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, డైట్‌ కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌, అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, ఈ.శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:46 AM