టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికో?
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:27 AM
తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురు టీడీపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నా నలుగురు మాత్రమే ప్రధానంగా రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండు సామాజికవర్గాలకు చెందిన నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు పాయకరావుపేట, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ పేర్లు వినిపిస్తున్నాయి
- ప్రధానంగా రేసులో నలుగురు నేతలు
- నియోజకవర్గాల ఇన్‌చార్జి పదవికీ పోటీ
- కసరత్తు చేస్తున్న అధిష్ఠానం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురు టీడీపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నా నలుగురు మాత్రమే ప్రధానంగా రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండు సామాజికవర్గాలకు చెందిన నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు పాయకరావుపేట, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం, దీనికి తోడు ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే జిల్లాలో లేనందున జిల్లా పార్టీ పగ్గాలు వారిలో ఎవరికైనా దక్కుతుందని పార్టీ వర్గాలల్లో చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ సీనియర్ నేత, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఈ పదవిని ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల టికెట్ ఆశించినా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గెలుపు కోసం తన వంతు పనిచేశారు. అదే సామాజికవర్గానికి చెందిన పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిఽధిలోని కోటవురట్ల మండలానికి చెందిన ప్రస్తుత పార్టీ జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి లాలం కాశినాయుడు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడికి ముఖ్య అనుచరుడిగా కాశినాయుడికి పార్టీలో గుర్తింపు ఉంది.
ఇన్‌చార్జుల నియామకంపై కసరత్తు
ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బత్తుల తాతయ్యబాబు కొనసాగుతున్నారు. ఆయనకు అధిష్ఠానం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చింది. ఆయన రెండు పదవుల్లో ఉన్నందున టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వేరొకరిని నియమించే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జుల నియామకాలు చేపట్టేందుకు అధిష్ఠానం దృష్టి పెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జిగా, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఆయనకు ప్రభుత్వం రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. పెందుర్తి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న గండి బాబ్జీకి టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఈ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్చే అవకాశం ఉంది. కాగా పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం రాజాన రమేశ్, మాజీ జడ్పీ చైౖర్‌పర్సన్ లాలం భవాని కుమారుడు లాలం భరత్ పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఇన్‌చార్జుల నియామకాలపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోందని తెలిసింది.