మహిళా కాఫీ రైతులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:10 AM
మన్యంలో అధిక సంఖ్యలో గిరిజనులు కాఫీ తోటల పెంపకంతో ప్రతి ఏటా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని అందించాలని కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ, కాఫీ బోర్డు, పీఎం ఫుడ్ ప్రొసెసింగ్ యోజన అధికారులు భావించారు. కాఫీ ఉత్పత్తిలో మహిళల పాత్ర కీలకం కావడంతో ఎంపిక చేసిన మహిళా రైతులకు సాయం అందించాలని నిర్ణయించారు. అందుకు గానూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఏజెన్సీలో కొయ్యూరు మినహా పది మండలాల్లో ఎంపిక చేసిన 425 మంది మహిళా కాఫీ రైతులకు 85 శాతం రాయితీపై అవసరమైన నాలుగు పరికరాలను అందించారు.
- రూ.4.99 కోట్లతో 425 మంది రైతులకు 85 శాతం రాయితీపై పరికరాల పంపిణీ
- ఒక్కొక్కరికి రూ.1.27 లక్షల విలువైన నాలుగు పరికరాలు అందజేత
- లబ్ధిదారుల ఆనందం
- నాణ్యమైన కాఫీ ఉత్పత్తి లక్ష్యం
- కలెక్టర్ దినేశ్‌కుమార్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో అధిక సంఖ్యలో గిరిజనులు కాఫీ తోటల పెంపకంతో ప్రతి ఏటా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో కాఫీ రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని అందించాలని కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ, కాఫీ బోర్డు, పీఎం ఫుడ్ ప్రొసెసింగ్ యోజన అధికారులు భావించారు. కాఫీ ఉత్పత్తిలో మహిళల పాత్ర కీలకం కావడంతో ఎంపిక చేసిన మహిళా రైతులకు సాయం అందించాలని నిర్ణయించారు. అందుకు గానూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఏజెన్సీలో కొయ్యూరు మినహా పది మండలాల్లో ఎంపిక చేసిన 425 మంది మహిళా కాఫీ రైతులకు 85 శాతం రాయితీపై అవసరమైన నాలుగు పరికరాలను అందించారు.
మహిళా రైతులకు అందించిన నాలుగు రకాల పరికరాలతో ఎటువంటి లబ్ధి చేకూరుతుందనేది అధికారులు ఇప్పటికే గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కాఫీ రైతులు మొక్కల నుంచి సేకరించిన గింజలను శుద్ధి చేసుకునేందుకు పల్పింగ్ యూనిట్, అలాగే కాఫీ తోటల్లో అంతర పంటగా ఉన్న మిరియాలను సేకరించుకునేందుకు అల్యూమినియం నిచ్చెన, కాఫీ గింజలు, మిరియాలను ఆరబెట్టుకునేందుకు అవసరమైన డ్రైయింగ్ యార్డ్, పాలిథిన్ టార్పలిన్ అందించారు. ఆ నాలుగు కాఫీ రైతులకు ప్రధానమైనవి కావడంతో వాటిని పొందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
80 శాతం రాయితీపై పరికరాలు అందజేత
ఒక్కో రైతుకు రూ.లక్షా 27 వేలు విలువ చేసే నాలుగు పరికరాలను 85 శాతం రాయితీలో కేవలం రూ.26 వేల 70 వేలకు అందించారు. ఆ 85 శాతం రాయితీలో కేంద్ర కాఫీ బోర్డు ద్వారా 50 శాతం రూ.56,900, ప్రధాన మంత్రి ఫుడ్ ప్రొసెసింగ్ యోజనలో 35 శాతం రాయితీ రూ.44,030 కల్పించారు. అలాగే మహిళా కాఫీ రైతులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సిన 15 శాతం (రూ.26,070) సొమ్మును సైతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణంగా అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
పరికరాలు పొందిన మహిళా కాఫీ రైతుల వివరాలు
వ. సం మండలం పేరు రైతుల సంఖ్య పరికరాల సొమ్ము
1. అనంతగిరి 35 రూ.40,98,605
2. అరకులోయ 24 రూ.26,66,490
3. చింతపల్లి 29 రూ.36,48,200
4. డుంబ్రిగుడ 57 రూ.65,19,945
5. జి.మాడుగుల 53 రూ.63,45,400
6. జీకేవీధి 30 రూ.37,74,000
7. హుకుంపేట 70 రూ.86,36,000
8. ముంచంగిపుట్టు 7 రూ.9,00,860
9. పాడేరు 82 రూ.93,21,600
10. పెదబయలు 38 రూ.46,26,400
-----------------------------------------------------------------------------------
మొత్తం 425 రూ.4,99,37,500
-----------------------------------------------------------------------------------