ఉద్యోగులు సమయ పాలన పాటించాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:31 AM
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో తమర్భ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు.
వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో ఆదేశం
చింతపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో తమర్భ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. సోమవారం మండలంలోని తాజంగి, లంబసింగి, లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ప్రసూతి, ల్యాబ్ రికార్డులు, మందుల గదిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేదన్నారు. ఉద్యోగులు ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలు, సాయంత్రం నాలుగు గంటలకు ముఖ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం అంబులెన్సు నిర్వహణ, ప్రసవాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆరోగ్య విస్తరణ అధికారి బి.లక్ష్మణ్, ఫార్మసీ అధికారి ఎస్.సంజీవరాజు ఉన్నారు.