Share News

విద్యుత్‌ సమస్య పరిష్కారం

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:21 AM

‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంతో జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమల నగర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారమైంది.

విద్యుత్‌ సమస్య పరిష్కారం

  • తిరుమల నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

  • అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా...

కూర్మన్నపాలెం, మార్చి 11 (ఆంద్రజ్యోతి):

‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంతో జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమల నగర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారమైంది. జనవరి 28వ తేదీన కాలనీలో నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమానికి హాజరైన అధికారుల దృష్టికి స్థానికులు లోవోల్టేజీ, వీధి దీపాల సమస్యను తీసుకువచ్చారు. దీంతో విద్యుత్‌ ఏఈ వీర్రాజు స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌, విద్యుత్‌ ఏఈ వీర్రాజుల చేతుల మీదుగా తిరుమలనగర్‌ కాలనీ వాసుల సమక్షంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. దీంతో తమ సమస్య పరిష్కారమైందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జి.నాగభూషణం, జి.విశ్వేశ్వరరావు, పరమేశ్వరరావు, సర్యాసిరావు, వసంతరెడ్డి, ఇజ్రాయిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 01:21 AM