Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:13 AM

ఇక్కడి జగ్గు జంక్షన్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.విజయలక్ష్మి (60) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

గాజువాక, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇక్కడి జగ్గు జంక్షన్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.విజయలక్ష్మి (60) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినగంట్యాడ ప్రాంతానికి చెందిన చింతకాయల వాణి స్కూటీపై తన తల్లి విజయలక్ష్మి, కుమార్తె తమన్వితో కలిసి సుందరయ్యకాలనీ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో జగ్గు జంక్షన్‌ దాటాక పెద్ద గొయ్యిని తప్పించేందుకు గాను స్కూటీని కుడివైపు మళ్లిస్తుండగా వెనుకే వస్తున్న భారీ వాహనం ఢీకొంది. దీంతో విజయలక్ష్మి రోడ్డు మధ్యలో పడిపోగా, ఆమె పైనుంచి వాహనం వెళ్లడంతో మృతి చెందింది. వాణి, తమన్విలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు వాహనాన్ని గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:13 AM