Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:46 AM

ఆటోనగర్‌ అన్న క్యాంటీన్‌ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కోన అప్పారావు (ఫైల్‌ ఫొటో)

అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆటోనగర్‌ అన్న క్యాంటీన్‌ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగ్లాంకు చెందిన కోన అప్పారావు(70) భెల్‌ హెచ్‌పీవీపీలో కార్మికునిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం గాజువాకలోని ఒక ప్రైవేటు షోరూంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతుండగా ఆటోనగర్‌లోని అన్న క్యాంటీన్‌ రహదారిలో ట్రాలర్‌ బలంగా ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందారు. ఆయన భార్య గత ఏడాది మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులు వున్నారు. అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:46 AM