రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎలమంచిలి బాలికలు ఎంపిక
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:30 PM
రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా జట్లలో స్థానిక తులసీనగర్‌లోని బాలికోన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్ధినులు స్థానం సంపాదించారు.
ఎలమంచిలి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా జట్లలో స్థానిక తులసీనగర్‌లోని బాలికోన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్ధినులు స్థానం సంపాదించారు. స్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో ఈ నెల 10వ తేదీన విశాఖలోని ఏయూ క్రీడా మైదానం, పోర్టు స్టేడియం, కైలాసపురం ప్రాంతాల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. బాలికోన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు ఉత్తమ ప్రతిభచూపడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా జట్లకు ఎంపికయ్యారు. వీరిని హెచ్‌ఎం కె.సుశీల, పీడీలు మూర్తి, శిరీష, పూర్ణిమ అభినందించారు.