Share News

విద్యుత్‌ సరఫరా మెరుగుకు కసరత్తు

ABN , Publish Date - May 31 , 2025 | 01:14 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో విద్యుత్‌ సరఫరా మెరుగుకు ఈపీడీసీఎల్‌ అధికారులు విస్తృతంగా పనులు చేపడుతున్నారు.

విద్యుత్‌ సరఫరా  మెరుగుకు కసరత్తు

ఫొటో పవర్‌: ఎలమంచిలి సబ్‌ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న పనులు

విద్యుత్‌ సరఫరా

మెరుగుకు కసరత్తు

ఎక్కడికక్కడే ఫీడర్ల విభజన

కొత్తగా సబ్‌ స్టేషన్ల నిర్మాణం

జూన్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి ఈపీడీసీఎల్‌ అధికారుల ప్రణాళిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖ జిల్లాలో విద్యుత్‌ సరఫరా మెరుగుకు ఈపీడీసీఎల్‌ అధికారులు విస్తృతంగా పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ సిస్టమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద నిధులు మంజూరు చేయడంతో గడువులోగా ఆయా పనులను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైతే విద్యుత్‌ లోడ్‌ అధికంగా పడుతుందో గుర్తించి ఆయా ఫీడర్లపై భారాన్ని తగ్గించి కొత్త ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు. భీమునిపట్నం నియోజకవర్గంలో గంధవరం, పాండ్రంకి, పెద్దిపాలెం, కోరాడ , శిర్లపాలెం, గోస్తనీ, వెల్లంకి, శొంఠ్యాం, రేవిడి, రెడ్డిపల్లిల్లో కొత్త ఫీడర్లు పెడుతున్నారు. వీటికి సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లను వెచ్చిస్తున్నారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే పూర్తికాగా మరికొన్ని జూన్‌ 10వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. వీటన్నింటినీ జూన్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ శ్యామ్‌బాబు తెలిపారు. అలాగే వేసవిలో విద్యుత్‌ సరఫరా మెరుగుకు చిల్లపేట, సుద్దగెడ్డ, తెన్నేటి నగర్‌, కూర్మన్నపాలెం, తదితర ప్రాంతాల్లో ఐదు కొత్త సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వీటికి ఒక్కోదానికి రూ.3.5 కోట్లు వెచ్చించామన్నారు.

అనకాపల్లి డివిజన్‌ విషయానికి వస్తే 61 విద్యుత్‌ ఫీడర్లలో 43 ఫీడర్లను కేవలం వ్యవసాయ కనెక్షన్‌ కోసం ప్రత్యేకంగా విభజిస్తున్నారు. సాధారణ గృహ విద్యుత్‌ అవసరాల కోసం అదనపు ఫీడర్లను పెడుతున్నారు. ఈ పనుల కోసం సుమారు రూ.125.5 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ పనులు చేపట్టడానికి వారంలో ఒకటి రెండు రోజులు విద్యుత్‌ సరఫరాను కొద్ది గంటలపాటు నిలిపివేస్తున్నారు. ఈ విషయాన్ని పత్రికల ద్వారా ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎలమంచిలిలోని 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో ఈ పనులు నిర్వహించడానికి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.10 గంటల వరకు, ఆ తరువాత మళ్లీ 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం సుమారు ఏడు గంటల పాటు పనులు చేపట్టారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అలాగే అచ్యుతాపురం మండంలోని వెదురువాడ ఫీడర్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ముందుగానే ప్రకటించారు. అయితే రాత్రి 7.30 గంటల వరకు పనులు జరగడం వల్ల మరో రెండు గంటలు అదనంగా సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని అనకాపల్లి డివిజన్‌ ఈఈ రాజశేఖర్‌ తెలిపారు. టవర్ల పైనుంచి విద్యుత్‌ వైర్లను లాగడం వల్ల ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఇప్పుడు ఈ పనులు చేపట్టడం వల్ల వచ్చే పదేళ్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయగలుగుతామని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రతి శుక్రవారం నిర్వహణ పనుల కోసం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారని, ఇప్పుడు కొత్త పనులు చేపట్టడం వల్ల ఇంకో రోజు సరఫరా ఆగుతోందని వివరించారు. డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ సరఫరా ఉందని, పనులు పూర్తయిన తరువాత 24/7 సరఫరా జరుగుతుందన్నారు.

Updated Date - May 31 , 2025 | 01:19 AM