మన్యంలో మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:49 PM
మన్యంలో మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. పాడేరు తలారిసింగి పాఠశాలలో ఆదివారం నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ మెగా బెల్ట్ టెస్టు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినీ నటుడు సుమన్
పాడేరురూరల్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): మన్యంలో మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. పాడేరు తలారిసింగి పాఠశాలలో ఆదివారం నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ మెగా బెల్ట్ టెస్టు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతలో చక్కని క్రమశిక్షణ ఉందన్నారు. మట్టిలో మాణిక్యాలు వంటి గిరిజన యువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు, ఇక్కడ క్రీడా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళతానన్నారు. అంతకు ముందు ఆయన మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, జనసేన నేత వంపూరి గంగులయ్య, స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు డప్పోడి వెంకటరమణ తదితరులు ఘనంగా సత్కరించారు.