కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:28 AM
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ రోటరీ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు
అనకాపల్లిలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం
తుమ్మపాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ రోటరీ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలుత నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తల సమస్యలను ఆలకించారు. పార్టీ బలోపేతానికి సంబంధించి సీనియర్ నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం వైసీపీలో ఉన్నారని, వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే పార్టీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించాలని కోరారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, కో-ఆర్డినేటర్లు కోటేశ్వరరావు, కొండలరావు, అనంత్, చక్రవర్తి, చినబాబు, బోయిన భానుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.