పర్యాటక అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:56 AM
అనకాపల్లి జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అనకాపల్లిలో ఎంపీ రమేశ్‌తో కలిసి ‘చాయ్ పే చర్చా’
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వీటికి శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 74 రైల్వేస్టేషన్‌లను అమృత్‌భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ రైల్వేజోన్‌ను ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించామన్నారు. జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీలను ఇథనాల్ ప్లాంట్లుగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.