Share News

అరకులోయలో రూ.55.84 కోట్లతో ఈకో లగ్జరీ రిసార్ట్స్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:46 PM

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో శుక్రవారం జిల్లాకు సంబంధించిన రెండు కీలక అంశాలు ఆమోదం పొందాయి.

అరకులోయలో రూ.55.84 కోట్లతో ఈకో లగ్జరీ రిసార్ట్స్‌

గుర్తేడు మండలం ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌

రాష్ట్ర క్యాబినెట్‌లో ఆమోదం

పాడేరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో శుక్రవారం జిల్లాకు సంబంధించిన రెండు కీలక అంశాలు ఆమోదం పొందాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న అరకులోయలో వీఎస్‌కే హోటల్స్‌ అండ్‌ రీస్టార్ట్స్‌ ఆధ్వర్యంలో రూ.55.84 కోట్లతో ఈకో లగ్జరీ రిస్టార్ట్స్‌ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ రిసార్ట్స్‌ నిర్మాణంతో 98 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయి. అలాగే జిల్లాలోని రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని వై.రామవరం మండలాన్ని విభజించి గుర్తేడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు గతంలోనే ఆమోదం తెలిపారు. అయితే వై.రామవరం మండలంలో 79 గ్రామాలుండగా, వాటిలో 59 గ్రామాలతో గుర్తేడులో మండల కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించగా దానిపై తుది నోటిషికేషన్‌ జారీ చేసేందుకు క్యాబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది.

Updated Date - Oct 10 , 2025 | 10:46 PM