Share News

ఇస్కాన్‌లో ఘనంగా దసరా సంబరాలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:58 AM

ఇస్కాన్‌లో గురువారం దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. ఉదయం సీతారామ,లక్ష్మణ, హనుమన్‌లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏర్పాటుచేసిన రామ కథామృతం, రామ గానామృతం, కీర్తనలు భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి.

ఇస్కాన్‌లో ఘనంగా దసరా సంబరాలు

  • 50 అడుగుల రావణ దిష్టిబొమ్మ దహనం

సాగర్‌నగర్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఇస్కాన్‌లో గురువారం దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. ఉదయం సీతారామ,లక్ష్మణ, హనుమన్‌లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏర్పాటుచేసిన రామ కథామృతం, రామ గానామృతం, కీర్తనలు భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. సాయంత్రం అదే ఆవరణలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా ఏర్పాటుచేసిన 50 అడుగుల రావణాసురుడి దిష్టిబొమ్మను ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఇస్కాన్‌ అధ్యక్షుడు సాంబదాసు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్‌ విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు శరసంధానం చేశారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫైర్‌ క్రాకర్స్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. రామలీలపై చేసిన ప్రవచనం పరవశులను చేసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఇస్కాన్‌ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు.


నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జరగనుందని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని సీఈవో పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:58 AM