ఆర్టీసీకి దసరా ధమాకా
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:39 AM
దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. గత నెల 24వ తేదీ నుంచి దసరా వరకు సరాసరి 99 శాతం ఓఆర్ నమోదు అయ్యింది. విజయవాడ వెళ్లే భవానీ మాలధారులు మొత్తం 31 బస్సులను బుక్ చేసుకున్నారు. డిపోలో ఉన్న 97 బస్సుల్లో 31 బస్సులు విజయవాడ వెళ్లి పోవడంతో శుక్రవారం బస్సుల కొరత కారణంగా నర్సీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎక్కువ సేపు వేచివున్నారు.
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు
90 నుంచి 100 శాతానికిపైగా ఓఆర్
భవానీ మాలధారుల కోసం విజయవాడకు 31 బస్సులు
9 రోజుల్లో నర్సీపట్నం డిపోకి రూ.1.55 కోట్ల ఆదాయం
నర్సీపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. గత నెల 24వ తేదీ నుంచి దసరా వరకు సరాసరి 99 శాతం ఓఆర్ నమోదు అయ్యింది. విజయవాడ వెళ్లే భవానీ మాలధారులు మొత్తం 31 బస్సులను బుక్ చేసుకున్నారు. డిపోలో ఉన్న 97 బస్సుల్లో 31 బస్సులు విజయవాడ వెళ్లి పోవడంతో శుక్రవారం బస్సుల కొరత కారణంగా నర్సీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎక్కువ సేపు వేచివున్నారు. దసరా సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణం అయ్యేవారు తగినన్ని బస్సులు అందుబాటులో ఇబ్బంది పడ్డారు. కాగా దసరా సందర్భంగా గత 24, 25 తేదీల్లో 105 శాతం ఓఆర్ వచ్చింది. అలాగే 26వ తేదీన 95 శాతం, 27వ తేదీన 110శాతం, 28వ తేదీన 95 శాతం, 29వ తేదీన 98 శాతం, 30వ తేదీన 90 శాతం, ఈ నెల ఒకటో తేదీన 105 శాతం, రెండో తేదీన 87 శాతం ఓఆర్ వచ్చింది. నర్సీపట్నం డిపో నుంచి నడిచే బస్సుల్లో తొమ్మిది రోజుల్లో 3,20,792 మంది ప్రయాణించారు. వీరిలో స్త్రీశక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించిన వారు 1,96,401 మంది వుండగా, టికెట్ తీసుకొని ప్రయాణించిన వారు 1,24,391 మంది ఉన్నారు. తొమ్మిది రోజుల్లో నర్సీపట్నం డిపోకి రూ.1.55 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.