Share News

డీఎస్సీ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:10 AM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు.

డీఎస్సీ ఫలితాలు విడుదల

  • ఎస్జీటీలో 92.9 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన గనివాడ సుజాత

  • 92.58 మార్కులతో ద్వితీయ స్థానంలో తాటికొండ ధనలక్ష్మి

  • ఈ కేటగిరీలో 14,595 మందితో మెరిట్‌ జాబితా

విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. సెకండరీగ్రేడ్‌ టీచర్ల నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు హాజరైన 14,595 మందికి వచ్చిన మార్కుల ప్రాతిపదికన మెరిట్‌ జాబితా విడుదల చేశారు. మొదటి నాలుగు స్థానాలు మహిళా అభ్యర్థులే కైవసం చేసుకున్నారు.

జిల్లాలో అత్యధికంగా 92.9 మార్కులతో గనివాడ సుజాత మొదటి ర్యాంకు సాధించారు. తాటికొండ ధనలక్ష్మి 92.58 మార్కులతో ద్వితీయ స్థానం, కొల్లి శారద 92.02 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. జాబితాలో 14,595వ ర్యాంకు సాధించిన వ్యక్తికి 14.22 మార్కులు వచ్చాయి. జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులు ఉండగా అందులో సెకండరీ గ్రేడు టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు 574 (ఏజెన్సీతో కలిపి) ఉన్నాయి. మిగిలిన 565 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష రాసిన 1,360 మందికి వచ్చిన మార్కులతో విడుదల చేసిన జాబితాలో ఎన్‌.శ్రీనివాస్‌ 82.87 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచారు. వెలగా ఎర్రాపాత్రుడు 81.78 మార్కులతో ద్వితీయ స్థానం, గండేపల్లి హరికృష్ణ 80.66 మార్కులతో తృతీయ స్థానం సంపాదించారు. గణితం సబ్జెక్టులో సుంకరం విజయ్‌ 94.67 మార్కులతో ప్రథమ స్థానం, కూనబిల్లి పద్మ 88.06 మార్కులతో ద్వితీయ, సరిపల్లి శ్రీనివాస్‌ 84.11 మార్కులతో తృతీయ స్ధానంలో నిలిచారు. బయాలజీలో బోకం అనిత 89.71 మార్కులతో ప్రథమ, రెడ్డి మంగవిజయ 88.14 మార్కులతో ద్వితీయ స్థానం, సీహెచ్‌డీజీ బ్రహ్మచారి 84.27 మార్కులతో

తృతీయ, తెలుగులో పంపోతు నాగేశ్వరరావు 85.4 మార్కులతో ప్రథమ, గురుగుబిల్లి చిరంజీవి 82.77 మార్కులతో ద్వితీయ, ఓమ్మి గంగునాయుడు 82.06 మార్కులతో తృతీయ, హిందీలో కురచా జ్యోత్స్న 86.05 మార్కులతో ప్రథమ, రెడ్డి మహాలక్ష్మి 85.05 మార్కులతో ద్వితీయ, మండపాలి ఝాన్సీబాయి 83.07 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.

ఇంగ్లీష్‌లో మరడాన శ్రావణి 86.13 మార్కులతో ప్రథమ, కేఎస్‌కేజే ప్రకాష్‌ 85.72 మార్కులతో ద్వితీయ, దాడి దివ్యపరిమిళ 83.9 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో గొర్లె శివరామకృష్ణ 83.5 మార్కులతో ప్రథమ, చిట్టిమూరి వరప్రసాద్‌ 80.5 మార్కులతో ద్వితీయ, ఎర్ని శివప్రసాద్‌ 79 మార్కులతో తృతీయ, సోషల్‌ స్టడీస్‌లో గెంజి రవి 87.28 మార్కులతో ప్రథమ, భవిరిశెట్టి రామకృష్ణ 86.18 మార్కులతో ద్వితీయ, కర్రిరాజు నాగేశ్వరరావు 85.99 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్జీటీ ఉర్దూలో షేక్‌ వాసింఅక్రమ్‌ 68.33 మార్కులతో ప్రథమ, పీడీఎస్‌ జావేద్‌ బాషా 62.6 మార్కులతో ద్వితీయ, పాలగిరి సానా 53.3 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.

జోన్‌-1 ప్రాతిపదికన పీజీటీ ఫలితాలు వెల్లడి...

మొదట పీజీటీ (పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్స్‌) రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జోన్‌-1 (ఉత్తరాంధ్ర జిల్లాలు) పరిధిలో పీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులకూ కలిపి 73 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఇంగ్లీష్‌ పరీక్ష 1,659 మంది రాయగా వచ్చిన మార్కుల వివరాలను మెరిట్‌ లిస్టులో పేర్కొన్నారు. ఇంగ్లీష్‌లో పిన్నింటి రవికుమార్‌ అనే అభ్యర్థి 79.5 మార్కులతో ప్రథమ ర్యాంకు, మజ్జి భవానీ 79 మార్కులతో రెండో ర్యాంకు, మళ్ల శ్రీను 78.5 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. హిందీ పరీక్ష 726 మంది రాయగా లెంక చక్రపాణి 82.5 మార్కులతో ప్రథమ ర్యాంకు, కురచా నారాయణమూర్తి 82.5 మార్కులతో రెండో ర్యాంకు, చింతాటి భారతి 82 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. తెలుగు పరీక్ష 2,102 మంది రాయగా పి.ధర్మారావు 85.5 మార్కులతో ప్రథమ ర్యాంకు, తుమరాడ దుర్గాప్రసాద్‌ 84.5 మార్కులతో రెండో ర్యాంకు, సరిపల్లి నాగరాజు 83 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. బయాలజీ సైన్స్‌ 549 మంది రాయగా కాట్రేనుకోన సత్యపావని 77.5 మార్కులతో ప్రథమ ర్యాంకు, కాలేరపు కిషోర్‌ 72.5 మార్కులతో ద్వితీయ స్థానం, అల్లెను సౌజన్య 72.5 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. సివిక్స్‌ (57 మంది)లో బోల్లేజు హరీష్‌ 76.5 మార్కులతో ప్రథమ స్థానం, బొమ్మిడి ఢిల్లేశు 69 మార్కులతో రెండో స్థానం, బూరి తవిటినాయుడు 66.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. కామర్స్‌లో 81.5 మార్కులతో మద్దాల అనిల్‌కుమార్‌ ప్రథమ స్థానం, 60.5 మార్కులతో దుద్ది సూర్యనారీయణ ద్వితీయ స్థానం, 59.5 మార్కులతో లింగాల మోహన్‌ తృతీయస్థానంలో నిలిచారు. గణితం (452 మంది)లో 78.5 మార్కులతో సుంకరాన విజయ, 73.5 మార్కులతో ఆరంగి ధనుంజయరావు, 72 మార్కులతో కొప్పల లక్ష్మణరావు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫిజికల్‌ సైన్స్‌ (420 మంది)లో 74 మార్కులతో నక్కా హరిబాబు, 70 మార్కులతో వెలగల ఎర్రాపాత్రుడు, 68.5 మార్కులతో అల్లు అశోక్‌కుమార్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. సోషల్‌ స్టడీస్‌ (146 మంది)లో కురమాన నిరోషా 85 మార్కులతో ప్రథమ స్థానం, రౌతు పోలినాయుడు 77.5 మార్కులతో ద్వితీయ స్థానం, కిల్లంపల్లి శ్రీకాంత్‌ 75.5 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.

Updated Date - Aug 23 , 2025 | 01:10 AM