Share News

డ్రైనేజీ అస్తవ్యస్తం

ABN , Publish Date - May 05 , 2025 | 12:43 AM

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా.. డ్రైనేజీ కాలువలు పొంగిపోయి మురుగు నీరు రోడ్లపై పారుతున్నది. మునిసిపాలిటీ ఏర్పడి 14 ఏళ్లు కావస్తున్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నోచుకోలేదు. మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమల బెడద అధికమైంది. మెయిన్‌ రోడ్డు మొదలుకొని చిన్నపాటి వీధుల వరకు డ్రైనేజీ కాలువల నిర్వహణ అధ్వానంగా వుంది. మెయిన్‌ రోడ్డుకి ఇరువులా ఉన్న డ్రైనేజీ కాలువలు 40 ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. పక్కా కాలువలు కాస్తా కచ్చా కాలువలుగా మరిపోయాయి.

డ్రైనేజీ అస్తవ్యస్తం
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన మురుగు

వర్షం కురిస్తే పొంగుతున్న కాలువలు

రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు

కాలువల అభివృద్ధికి చర్యలు శూన్యం

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

దుర్వాసన, దోమల బెడదతో ప్రజల ఇక్కట్లు

నర్సీపట్నం, మే 4 : పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా.. డ్రైనేజీ కాలువలు పొంగిపోయి మురుగు నీరు రోడ్లపై పారుతున్నది. మునిసిపాలిటీ ఏర్పడి 14 ఏళ్లు కావస్తున్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నోచుకోలేదు. మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమల బెడద అధికమైంది. మెయిన్‌ రోడ్డు మొదలుకొని చిన్నపాటి వీధుల వరకు డ్రైనేజీ కాలువల నిర్వహణ అధ్వానంగా వుంది. మెయిన్‌ రోడ్డుకి ఇరువులా ఉన్న డ్రైనేజీ కాలువలు 40 ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. పక్కా కాలువలు కాస్తా కచ్చా కాలువలుగా మరిపోయాయి.

గత ప్రభుత్వంలో అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుము వరకు మెయిన్‌ రోడ్డు విస్తరణతో డ్రైనేజీ సమస్య తొలగుతుందని ప్రజలు భావించారు. అయితే స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారిలో కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండి పోయాయి. దీంతో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది డ్రైనేజీ పరిస్థితి. అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుము వరకు 3,000 వేల మీటర్ల మేర డ్రైనేజీ కాలువలు నిర్మించాల్సి వుండగా, కేవలం 250 మీటర్లు మాత్రమే పూర్తి నిర్మించారు. అసంపూర్తి పనుల కారణంగా కాలువల్లో మురుగు నీరు పారడం లేదు. రోడ్డుకు ఇరువైపులా వున్న వ్యాపారులు, నివాసితులు దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. చింతపల్లి రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు, నర్సీపట్నం- కృష్ణాదేవి పేట రోడ్డులో కాలువలు పూర్తిగా పూడుకు పోయాయి.

వార్డుల్లో పరిస్థితి మరీ అధ్వానం..

మునిసిపాలిటిలోని ఇతర ప్రాంతాల్లో సైతం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.. వీధి కాలువల్లో నుంచి మురుగు నీరు మెయిన్‌ డ్రైనేజీలోకి పంపే మార్గం లేదు. సీసీ రోడ్లు నిర్మిస్తున్న అధికారులు.. డ్రైనేజీ కాలువల గురించి పట్టించుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాలైన వెంకునాయుడుపేట, బొంతువీధిలో డ్రైనేజీ నీరు పోయే మార్గం లేక చిన్నపాటి వర్షానికి మురుగునీరు రోడ్లపై పారుతున్నది. ప్రశాంతి నగర్‌, బ్యాంక్‌ కాలనీ, శారదా నగర్‌, బొంతువీధి, శివపురం తదితర ప్రాంతాల్లో కాలువలు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated Date - May 05 , 2025 | 12:43 AM