Share News

నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా ముసాయిదా నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:35 AM

జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం మంత్రివర్గ ప్రతిపాదన ప్రభుత్వానికి అందిన సంగతి తెలిసిందే. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సమగ్ర నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం ముసాయిదా నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి.

నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా ముసాయిదా నోటిఫికేషన్‌
నక్కపల్లి బోర్డు

- సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరణ

అనకాపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం మంత్రివర్గ ప్రతిపాదన ప్రభుత్వానికి అందిన సంగతి తెలిసిందే. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సమగ్ర నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం ముసాయిదా నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఎలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాలు ఉండనున్నాయి. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం, చీడికాడ మండలాలు ఉంటాయి. నర్సీపట్నం డివిజన్‌లో నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం, రావికమతం, మాడుగుల, రోలుగుంట మండలాలు ఉండనున్నాయి. ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సమగ్ర నివేదికను మరోసారి కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపనున్నారు. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా నక్కపల్లి కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది.

Updated Date - Nov 28 , 2025 | 12:35 AM